Anupama Parameswaran: పోస్టర్‌పై అమ్మాయి బొమ్మ కనిపిస్తే థియేటర్‌కు రారు.. పచ్చి నిజాలు మాట్లాడిన అనుపమ

Edited By: Phani CH

Updated on: Jul 21, 2025 | 10:11 PM

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదా..? కనీసం ఓటిటి రేట్ కూడా ఇవ్వట్లేదా..? డిజిటల్ సంస్థలు పట్టించుకోవట్లేదా..? నిర్మాతలు కూడా లేడీ ఓరియెంటెడ్ అంటే వెనకడుగు వేస్తున్నారా..? ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడెందుకు వచ్చాయబ్బా అనుకుంటున్నారా..? అయితే అనుపమ పరమేశ్వరన్ చేసిన ఈ కామెంట్స్ వినండి మీరే..

1 / 5
వింటున్నారు అనుపమ పరమేశ్వరన్ ఏమంటున్నారో.. పోస్టర్‌పై అమ్మాయి బొమ్మ కనిపిస్తే థియేటర్‌కు ఆడియన్స్ రారు.. స్క్రీన్స్ ఇవ్వరు.. ఓటిటి వాళ్లు కూడా పట్టించుకోరు అంటూ హార్ష్ రియాలిటీపై ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ.

2 / 5
పరదా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌లో అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయిప్పుడు. టిల్లు స్క్వేర్ తర్వాత తెలుగులో మళ్లీ ఈమె సినిమా చేయలేదు.. తమిళ, మలయాళంలో బిజీ అయిపోయారు.

3 / 5
తాజాగా ఈమె నటిస్తున్న పరదా విడుదలకు సిద్ధమైంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎప్పట్నుంచో రెడీగానే ఉంది.. కాకపోతే థియేటర్స్ దొరకట్లేదు.. రిలీజ్ డేట్ కూడా దొరకట్లేదు.. ఇదే విషయాన్ని ధైర్యంగా చెప్పారు అనుపమ.

4 / 5
ఆగస్ట్ 22న పరదా విడుదల కానుంది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రెగుల దర్శకుడు. అనుపమ కామెంట్స్‌తో ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతుంది.

5 / 5
అయితే కథ బలంగా ఉంటే.. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా రప్ఫాడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి పరదా ఏం చేస్తుందో చూడాలిక.