
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి.. తర్వాతి సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలైన తర్వాత చిరంజీవితో కలిసి ఆయనకు ఎలాంటి కథ కావాలనే విషయాన్ని మాట్లాడి.. దానికి తగ్గట్టుగా కథను సిద్ధం చేసే పనిలో ఉంటామని అనిల్ రావిపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

'35 చిన్న కథ కాదు' సినిమాలో నటించి మెప్పించిన యువ నటుడు విశ్వదేవ్ రాచకొండ. తాజాగా ఈయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలి మేఘశ్యామ' నేరుగా ఓటిటిలోకి రాబోతుంది. 'నీలి మేఘశ్యామ' సినిమాను ఆహాలో విడుదల చేస్తున్నారు. మీతో ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ, ఎమోషన్స్‌కు సంబంధించి విభిన్నమైన షేడ్స్ ఉన్న నీలి మేఘశ్యామ జనవరి 9 నుంచి ఆహాలో ప్రీమియర్ కాబోతోంది అంటూ అధికారిక సమాచారం ఇచ్చారు.

దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ‘ఓ వెన్నెల’ అనే పాటను విడుదల చేసారు న్యాచురల్ స్టార్ నాని.

‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం నెక్ట్స్ సినిమాతో సిద్ధమవుతున్నారు. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దిల్ రుబా’ టీజర్ విడుదలైందిప్పుడు. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా టీజర్ విడుదలైందిప్పుడు. రుక్సర్ థిల్లన్ ఇందులో హీరోయిన్.

బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ డాకు మహరాజ్ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే బాలయ్య అమెరికా వెళ్లారు. అక్కడ ఆయనకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.