
బుల్లితెరపై టాప్ యాంకర్లలో సుమ ఒకరు. సినిమా హీరోహీరోయిన్స్ కన్నా బిజీగా ఉంటుంది. ఎప్పుడు టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇలా ప్రతి రోజూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అయినప్పటికీ ఏమాత్రం అలసిపోయినట్లు కనిపించదు. అయితే ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్ చేసిన సుమ.. చాలా కాలంగా టీవీ షోలు, ఈవెంట్లకే పరిమితమైంది. నటనకు స్వస్తి చెప్పిన సుమ.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. చివరగా 2022లో జయమ్మ పంచాయితీ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రేమంటే సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది.

ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో కనిపించనుంది సుమ. తాజాగా ఈ మూవీ టీజర్ ఈవెంట్ లో పాల్గొన్న సుమ సరదాగా మాట్లాడారు. సుమ మాట్లాడుతూ.. ఎప్పుడూ మనమే ప్రోగ్రాం స్టార్ట్ చేస్తుంటాం.. కానీ ఈశారి యాంకర్ గీత నా చెక్కు కొట్టేసింది.

ఈ సినిమాలో నన్ను ప్రియదర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. కానీ దర్శి వయసు నాకంటే తక్కువ కావడంతో డైరెక్టర్ నవనీత్ వద్దన్నారు. ఆ తర్వాత పవర్ ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకున్నారు. సినిమాలో ఓ సీన్ చేశాక. పవర్ ఫుల్ కానిస్టేబుల్ కాదు.. పవర్ లెస్ కానిస్టేబుల్ అని తెలిసింది.

నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను. కానీ కుర్రాడికింకా పెళ్లి కాలేదని వదిలేశాను. పెళ్లి చేసుకుంటే అంతకన్నా పెద్ద కేసు ఇంకోటి ఏముంటుంది. గ్లామర్ విషయానికి వస్తే.. హీరోయిన్ ఆనంది కంటే నేనే ఎక్కువ గ్లామర్‌గా కనిపించానని చెప్తున్నారు. ఈ సినిమాలో హుక్ స్టేప్ వేశాను అంటూ సరదాగా స్పీచ్ ఇచ్చింది.