
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు ఎక్కువగా బుల్లితెరకే పరిమితమైందీ అందాల తార. కాగా టాలీవుడ్ బుల్లితెరకు సంబంధించి పెళ్లి కానీ ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ పేరు కూడా ఉంటుంది.

ఇక ఇప్పుడు ఈ చిన్నది టీవీ షోలతో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు మూగజతువులంటే రష్మీకి ఎంతో ప్రేమ. మూగజీవుల గురించి, వాటి సంరక్షణ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది.

ఇక రష్మీ గౌతమ్ తన టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సొషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే రష్మీ కొన్ని సినిమాల్లోనూ నటించిన విషయం తెలిసిందే. కానీ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ అంతగా సక్సెస్ కాలేదు.

నితిన్ హీరోగా నటించిన జయం సినిమాలో ముందుగా రష్మీని హీరోయిన్ గా అనుకున్నారట.. కానీ ఆమెను తప్పించి సదా ను హీరోయిన్ గా తీసుకున్నారట. ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరో సినిమా ఛాన్స్ ను రెండు సార్లు మిస్ అయ్యిందట రష్మీ. ఇంతకూ ఆ హీరో ఎవరో ఎవరో తెలుసా.. ఆయన తమిళ్ హీరో విజయ్ ఆంటోని.

విజయ్ ఆంటోని నటించిన సలీం సినిమాలో ముందుగా రష్మిని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ లాస్ట్ మినిట్ లో ఆ ఛాన్స్ మరో హీరోయిన్ కు దక్కింది. సలీమ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే విజయ్ ఆంటోని నటించిన బేతాళుడు అనే సినిమాకు కూడా ముందుగా రష్మిని అనుకున్నారట.. కానీ అది కూడా సెట్ కాదు. అలా విజయ్ రెండు సినిమాల్లో ఛాన్స్ మిస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.