స్టార్ యాంకర్ గా రాణించి ఇప్పుడు సినిమాలతో బిజీగా మారిపోయింది అందాల భామ అనసూయ. యాంకర్ గా తన మాటలతోనే కాదు అందాలతోను ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఆ క్రేజ్ తో సినిమాల్లో ఆవకాశాలు నడుకుంది అనసూయ. అనసూయ ఎన్ని సినిమాల్లో నటించినా ఆమె కెరీర్ ను టర్న్ చేసిన సినిమా మాత్రం రంగస్థలం అనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది.