- Telugu News Photo Gallery Cinema photos Amitab Bachchan proudly declares that he is member of telugu film industry
Amitab Bachchan: నేను తెలుగు నటుడినే.. నన్ను పట్టించుకోండి..
నేనూ మీ వాన్నే.. తెలుగు నటుడినే.. నన్ను కూడా పట్టించుకోండి కాస్త..! ఈ మాటలు అన్నదెవరో కాదు ఇండియన్ సినిమా లెజెండ్... ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అమితాబ్ బచ్చన్. ఆయన మాటలే వైరల్ అవుతున్నాయిప్పుడు. మెల్ల మెల్లగా టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు బిగ్ బి. మరి ఆయన కోరినట్లుగా మన దర్శకులు బిగ్ బికి ఛాన్సులిస్తారా..?
Updated on: Nov 01, 2024 | 8:23 PM

నేనూ మీ వాన్నే.. తెలుగు నటుడినే.. నన్ను కూడా పట్టించుకోండి కాస్త..! ఈ మాటలు అన్నదెవరో కాదు ఇండియన్ సినిమా లెజెండ్... ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అమితాబ్ బచ్చన్. ఆయన మాటలే వైరల్ అవుతున్నాయిప్పుడు. మెల్ల మెల్లగా టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు బిగ్ బి. మరి ఆయన కోరినట్లుగా మన దర్శకులు బిగ్ బికి ఛాన్సులిస్తారా..?

అమితాబ్ బచ్చన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమా చెప్పండి..? ఆయన పేరే ఓ బ్రాండ్..! కాకపోతే కొన్నేళ్ళ కింది వరకు కేవలం హిందీలో మాత్రమే నటించిన అమితాబ్ జీ.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఓకే అంటున్నారు.

మరీ ముఖ్యంగా తెలుగుపై ఒకింత ఎక్కువ ప్రేమనే చూపిస్తున్నారు. పైగా బిగ్ బి ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా. పదేళ్ళ కింద మనం సినిమాతో తొలిసారి తెలుగు సినిమాలో నటించారు అమితాబ్ బచ్చన్. కాకపోతే అది నాగార్జున కోరిక మేరకు.. అక్కినేని చివరి చిత్రం కాబట్టి అలా కనిపించి మాయమైపోయారంతే.

కానీ సీరియస్‌గా బిగ్ బి ఓ తెలుగు సినిమాలో నటించింది మాత్రం సైరాలోనే. ఆ తర్వాతే కల్కిలో అదరగొట్టారీయన. తాజాగా ఏఎన్నార్ వేడుకలో నేనూ తెలుగు నటుడినే అంటూ చెప్పుకొచ్చారు.

వింటున్నారుగా అమితాబ్ బచ్చన్ మనసులో మాట..! నిజం చెప్పాలంటే కొన్నేళ్లుగా బిగ్ బిలోని నటుడిని హిందీ కంటే తెలుగు దర్శకులే ఎక్కువగా వాడుకుంటున్నారు.. గౌరవిస్తున్నారు కూడా. అందుకే తెలుగుపై ఆ ప్రేమ చూపిస్తున్నారు అమితాబ్. ఈయన తీరు చూస్తుంటే ఇకపై పూర్తిగా టాలీవుడ్‌లోనే ఉండిపోయేలా కనిపిస్తున్నారు.