
మహిస్మతి: ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలిలో సినిమా రాజమౌళి సృష్టించిన మహా సామ్రాజ్యం మహిస్మతి. దీని వైభవం, సంక్లిష్టమైన నిర్మాణాలు ప్రేక్షకులను పురాతన కాలానికి తీసుకెళ్లింది. దీని నిర్మాణం మహా అద్భుతం అనే చెప్పాలి.

వాజీ: సాహోలో కాల్పనిక నగరం వాజీ అనేది భవిష్యత్ మహానగరం. ఇది వాస్తవికంగా రూపొందించబడింది, ఇది అధునాతన సాంకేతికత, సందడిగా ఉండే నగర దృశ్యాల మిశ్రమాన్ని ప్రదర్శిస్తుంది. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ రూ. 450 కోట్లు కొల్లగొట్టు డార్లింగ్ స్టేమినా ఏంటో చాటి చెప్పింది.

ఖాన్సార్ సిటీ: ప్రభాస్ హీరోగా వచ్చింది సలార్ సినిమాలో ఖాన్సార్ సిటీ సిటీని సృష్టించారు ప్రశాంత్ నీల్. సినిమాలో ఈ నగరన్నీ చూసి ప్రేక్షకులు వావ్ అన్నారు. ఈ నగరాన్ని చూపించడంలో ది బెస్ట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 715 కోట్లు రాబట్టింది. ఈ మూవీ పార్ట్ 2కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

కాశీ: 2024 బిగ్గెస్ట్ హిట్ కల్కి 2898 ఏడీ సినిమాలో కలియుగం చివర్లో కాశీ నగరం ఎలా ఉంటుందో ఫిక్షనల్‌గా చూపించారు నాగ్ అశ్విన్. కలియుగ అంతంలో కాశీలో గంగ పూర్తిగా ఎండిపోతుంది అని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఆధారం గంగ లేని కాశిని చూపించారు.

శంభల: హిందూ పురాణాలు ప్రకారం.. అదృశ్య నగరం శంభల. కలియుగం అంతం సమయంలో దుష్ట శిక్షణకై కల్కి భగవానుడు ఈ నగరంలో జన్మిస్తారని నమ్మకం. అలాంటి ఈ నగరాన్ని ప్రభాస్ కల్కి సినిమాలో అద్భుతంగా సృష్టించారు మేకర్స్.

కాంప్లెక్స్: కల్కి సినిమాలో నాగ్ అశ్విన్ మరో అద్భుత సృష్టి కాంప్లెక్స్. ఇది కాశీ, శంభల నగరాలకు విభిన్నంగా పచ్చని తోటలు, అడవులు, పుష్కలంగా నీటిని కలిగిన సముద్రంతో విలసిల్లుతుంది. ఇది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.