
అస్సల తగ్గేదేలే అని పుష్పరాజ్ అంటే, అసలు తగ్గాల్సిన అవసరమే లేదన్నా అని అంటోంది అల్లుఆర్మీ. వినీ వినగానే ఇన్‌స్టంట్‌గా అందరినీ మెప్పిస్తోంది పుష్ప పుష్ప పుష్పరాజ్ సాంగ్. థీమ్ ఏంటి? లిరిక్స్ ఎలా ఉన్నాయి? పాటలో అల్లు అర్జున్ మాటలెలా ఉన్నాయి? టీ గ్లాసు బిస్కట్ పట్టుకుని ఆయన వేసిన స్టెప్పులెలా ఉన్నాయి... అన్నీ మాట్లాడుకుందాం రండి...

అదిరిపోయే బీట్, మెస్మరైజ్ చేసే విజువల్స్, హై క్లాస్‌మేకింగ్, ఊరమాస్ స్టెప్స్, ఉర్రూతలూగించే లిరిక్స్, వావ్ అనిపించే టేకింగ్... అన్నీ కలిపి పుష్ప పుష్ప పుష్పరాజ్ స్వాగ్‌ని ప్రజలకు అద్భుతంగా పరిచయం చేశాయి. ఈ ఒక్క పాట చాలు సీక్వెల్ ఓ ఊపు ఊపేస్తుందని గట్టిగా చెప్పడానికి అని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్.

ఆ పాటకు తగ్గట్టు షూ స్టెప్, ఫోన్ స్టెప్ అని పెర్ఫార్మ్ చేసి, తన మార్క్ ని మరోసారి చూపించేశారు బన్నీ. కల్ట్ కేరక్టర్‌లో తమ అభిమాన నటుడిని చూసుకోవడానికి రెడీ అవుతున్నారు జనాలు.

అందుకే ఇలాంటి కేరక్టర్ల మీద స్పెషల్ ఇంట్రస్ట్ పెంచుకుంటారు జనాలు. పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ పుష్పరాజ్‌కి తెలిసినవేంటో, తెలియనివేంటో ఒక్క పాటలో క్లియర్ కట్ గా చెప్పించేశారు కెప్టెన్ సుకుమార్.

నేషనల్ అవార్డు తెచ్చిపెట్టి, ప్యాన్ ఇండియా ఆడియన్స్ కి దగ్గర చేసిన పుష్ప మూవీకి వస్తున్న సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఈగర్‌గానే వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తోంది అల్లు ఆర్మీ.