Rajeev Rayala |
Updated on: Nov 01, 2023 | 12:01 PM
వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి వివాహం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ జంట ఇటలీలో వివాహం చేసుకుంటున్నారు.
పనులు మొత్తం పూర్తయ్యి.. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో సందడి చేయనుంది. హల్దీ , మెహందీ సెలబ్రేషన్స్ నిన్ననే పూర్తయ్యి.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ లో వరుణ్ తేజ్, లావణ్య చూడముచ్చటగా ఉన్నారు.
వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి చేశారు. బన్నీ స్టైలిష్ లుక్ లో కనిపించాడు ఆకట్టుకున్నాడు.
అలాగే యంగ్ హీరో నితిన్ ఆయన సతీమణి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.