- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun Birthday Special Icon Star Rare Photos Goes Viral telugu movie news
Allu Arjun Birthday: ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ అరుదైన ఫోటోస్ చూశారా ?..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు బన్నీ అరుదైన ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. 1982 ఏప్రిల్ 8న జన్మించారు బన్నీ. అలనాటి హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనయుడు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా సినీరంగ ప్రవేశం చేశారు.
Updated on: Apr 08, 2024 | 11:54 AM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు బన్నీ అరుదైన ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

1982 ఏప్రిల్ 8న జన్మించారు బన్నీ. అలనాటి హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనయుడు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా సినీరంగ ప్రవేశం చేసారు.

బాలనటుడిగా విజేత, స్వాతిముత్యం సినిమాల్లో కనిపించిన బన్నీ.. ఆ తర్వాత గంగోత్రి మూవీతో సినీరంగ ప్రవేశం చేశారు. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో బన్నీ నటనకు ప్రశంసలు కురిపించారు సినీ విమర్శకులు.

ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఆర్య సినిమా బన్నీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే పరుగు, డీజే, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు.

ఇక 2021లో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ యాక్టింగ్ చూసి మేకర్స్ ఆశ్చర్యపోయారు.

ఈ సినిమాలోని పుష్పరాజ్ పాత్రలు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు బన్నీ. ప్రస్తుతం పుష్ప 2 సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.

తాజాగా బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో పట్టుచీరలో ఒండినిండ బంగారు ఆభరణాలతో గంగమ్మ జాతరలో నడిచి వస్తున్న అమ్మోరుగా కనిపించారు బన్నీ. పుష్ప రాజ్ మేనరిజంతో.. చీరుకొంగును నడుముకు చుట్టుకుంటూ వచ్చాడు బన్నీ.

ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ అరుదైన ఫోటోస్ చూశారా ?..




