
నక్కుకుంటూ కాదు.. తొక్కుకుంటూ పోవాలే.! ఇప్పుడు పుష్ప రాజ్ దూకుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కనిపించిన ఒక్క రికార్డును కూడా వదిలేలా కనిపించడం లేదు బన్నీ.

రాబోయే సినిమాలకు కనుచూపు మేరలో మరే రికార్డు కనబడకుండా చేయడమే పనిగా పెట్టుకున్నాడు పుష్ప. ఈ దూకుడుతో 2000 కోట్ల వైపు పుష్ప అడుగులు పడతాయా.?

సినిమా ఎప్పుడొచ్చిందని కాదు.. ఇప్పటికీ ఎంత దూకుడు చూపిస్తుందనేది ముఖ్యం. ఈ విషయంలో పుష్ప 2 టాప్ అంతే. 2 వారాల తర్వాత బన్నీ దూకుడు మామూలుగా లేదు.

తాజాగా 1500 కోట్ల క్లబ్బులోనూ చేరిపోయింది ఈ చిత్రం. పుష్ప 2కు ముందు ఈ క్లబ్బుల్లో ఉన్న ఏకైక సినిమా బాహుబలి 2. 2017లోనే ఇది చేసి చూపించారు రాజమౌళి.

ఇప్పటికే హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. స్త్రీ 2 పేరు మీదున్న 600 కోట్ల రికార్డు సైతం లాగేసుకున్నాడు పుష్ప రాజ్. 700 కోట్ల వైపు పుష్ప అడుగులు పడుతున్నాయి.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ 200 కోట్ల షేర్ దిశగా వెళ్తుంది పుష్ప 2. బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ మినహా.. మరే సినిమా ఏపీ, తెలంగాణలో కలిపి 200 కోట్ల షేర్ దాటలేదు.

బాలీవుడ్‌లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం..! క్రిస్మస్‌కు బేబీ జాన్ తప్పిస్తే.. అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. దాంతో న్యూ ఇయర్ వరకు పుష్ప దూకుడు ఖాయం.

ఇదే జరిగితే బాలీవుడ్‌లో సోలోగా 800 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా జరిగితే.. నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో..?