
రెండు యూనిట్లతో షూటింగ్ స్పీడు పెంచారు కెప్టెన్ సుకుమార్. రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీతో ఓ షూటింగ్ జరుగుతోంది. కాకినాడ పరిసరాల్లో మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ రెండు పాటల్ని విడుదల చేశారు. ఇంకో రెండు పాటలను తెరకెక్కించాలి. వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్.

పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో.. ఇండస్ట్రీ కూడా అదే స్థాయిలో వేచి చూస్తుంది. ఇండియన్ సినిమాలో నెక్ట్స్ 1000 కోట్ల సినిమా ఇదే అంటూ అంచనాలు పెంచేస్తున్నారు.

మరి ఇప్పుడు ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తారా.? అటు డిసెంబర్‌లోనే ముఫాసాతో ఫ్యాన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు మహేష్. గేమ్ చేంజర్ అండ్ అదర్ సినిమాలు ఎలాగూ క్యూలో ఉన్నాయి. వాటి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుస్తూనే ఉంది.

ప్రస్తుతానికి నవంబర్లో ఒక్క సిద్దూ జొన్నలగడ్డ మాత్రమే రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు. నవంబర్ 9న తెలుసు కదా మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. మరికొన్ని సినిమాలు ఈ సీజన్‌లో డేట్స్ లాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇక డిసెంబర్ 6న మోస్ట్ అవెయిటెడ్ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

జస్ట్ ఊరించడం కాదు.. ఐకాన్ స్టార్ సినిమాకు పక్కా వెయ్యి కోట్ల బిజినెస్ రాసిపెట్టుకోండి అనే ధీమా కనిపిస్తోంది అల్లు అర్జున్ ఆర్మీలో.

ఎన్ని రోజులైనా పర్లేదు.. ఎంత లేటైనా పర్లేదు అనుకున్నది వచ్చేవరకు తగ్గేదే లే అన్నట్లు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. ఇక వాయిదాలేం లేవు.. డిసెంబర్ 6న కుమ్మేద్దాం అంటున్నారు పుష్ప 2 టీం.