అల్లరి నరేష్‌ను ఇలా చూడ్డం కంటే.. కామెడీ రోల్స్‌లో చూడ్డానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్. ఆయన సీరియస్ రోల్స్ కూడా ఇరగదీస్తారు.. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కూడా.
కానీ నరేష్‌లో ఉండే నవ్వుల్ని మాత్రం మిస్ అవ్వకూడదనుకుంటున్నారు ప్రేక్షకులు. అందుకే కొన్నాళ్లు సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మళ్లీ కామెడీ వైపు అడుగులేస్తున్నారు.. పాత నరేష్‌ను బయటికి తెస్తున్నారు.
రెండేళ్ల కింద నాందీతో సీరియస్ టర్న్ తీసుకున్న నరేష్.. తర్వాత మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో వచ్చారు. ఈ మధ్యే నా సామిరంగాలోనూ నవ్విస్తూనే.. ఏడిపించారు నరేష్. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చల మల్లిలో సీరియస్ రోల్ చేస్తున్నారు.
తాజాగా అంకం మల్లి దర్శకత్వంలో ఆ ఒక్కటి అడక్కు సినిమా చేస్తున్నారు నరేష్. దీని టీజర్ విడుదలైందిప్పుడు.పెళ్లి కాన్సెప్ట్‌తో ఆ ఒక్కటి అడక్కు వస్తుంది. టీజర్‌తోనే సినిమాలో ఎంటర్‌టైన్మెంట్‌కు ఢోకా ఉండదని అర్థమవుతుంది.
గతంలోనూ పాత టైటిల్స్ బాగా వాడుకున్నారు నరేష్. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. బంగారు బుల్లోడు, యముడికి మొగుడు, అహ నా పెళ్లంట లాంటి క్లాసిక్ టైటిల్స్‌తో సినిమాలు చేసారు నరేష్. ఇప్పుడు వాళ్ల నాన్నగారి ఆ ఒక్కటి అడక్కు టైటిల్ వాడుకుంటున్నారు. మరి ఇదెలా ఉండబోతుందో చూడాలి.