Malayalam Heroes: హీరోయిన్ల బాటలో హీరోలు.. మాలీవుడ్‌ టూ టాలీవుడ్‌ ప్రయాణం..

Updated on: Feb 11, 2025 | 7:47 AM

నీరు పల్లమెరుగు.. సినిమా ఇండస్ట్రీ క్రేజ్‌ ఎరుగు.. అంతేనంటారా? అంతేలెండి.. క్రేజ్‌ ఎక్కడుందో తెలుసుకున్నారు కాబట్టే, మాలీవుడ్‌ హీరోలందరూ టాలీవుడ్‌ వైపు బారులు తీస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు క్యాష్‌ చేసుకుంటే, ఇప్పుడు హీరోలు కూడా అదే బాట పడుతున్నారు. ఆ హీరోలు ఎవరు.? రానున్న సినిమాలు ఏంటి.?

1 / 5
దుల్కర్‌ సల్మాన్‌ని ఇప్పుడు ఎవరూ మాలీవుడ్‌ హీరోగా చూడటం లేదు. ఆయన్ని టాలీవుడ్‌ హీరో అంటే కాదనేవారు అసలెవరూ లేరు. అంతగా తెలుగు సినిమాలతో ప్రూవ్‌ చేసుకున్నారు దుల్కర్‌.

2 / 5
ఆ రూట్లోనే టాలీవుడ్‌కి వచ్చేశారు ఫహాద్ ఫాజిల్. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ఆయన నటనను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. పుష్ప  రెండు పార్టుల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

3 / 5
నాకు లాంగ్వేజ్‌ బేరియర్స్ అసలెప్పుడూ లేవంటున్నారు పృథ్విరాజ్‌ సుకుమారన్‌. సలార్‌తో సీక్వెల్‌తో పాటు మహేష్‌ సినిమాలోనూ కీ రోల్‌ చేస్తున్నారు పృథ్విరాజ్‌. ఆయన డైరక్ట్ చేసిన ఎల్‌2 ఎంపురాన్‌ కూడా తెలుగులో విడుదలవుతోంది.

4 / 5
మలయాళ హీరో ఉన్ని ముకుందన్‌ కూడా అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తూనే ఉన్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, జయరామ్‌ ఎప్పుడూ మనవారైపోయారు. లేటెస్ట్ గా దేవ్‌ మోహన్‌ కూడా టాలీవుడ్‌తో అనుబంధం పెంచుకుంటున్నారు. శాకుంతలంలో నటించిన దేవ్‌ మోహన్‌, ఇప్పుడు సతీలీలావతిలో లావణ్య త్రిపాఠితో జోడీ కడుతున్నారు.

5 / 5
వీటన్నిటికన్నా టాప్‌ నాచ్‌ న్యూస్‌ ఇప్పుడు తారక్‌ సినిమాలో టొవినో థామస్‌ కీ రోల్‌ చేస్తున్నారన్నదే. ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్‌లో తారక్‌ నటించే సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట టొవినో. రీసెంట్‌గా తన సినిమాలను తెలుగులో బాగా ప్రమోట్‌ చేస్తున్న టొవినో, త్వరలోనే తెలుగులో మాట్లాడుతానంటూ ఆ మధ్య హింట్‌ ఇవ్వడం దీనికోసమేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు తారక్‌ ఫ్యాన్స్.