కమల్‌హాసన్ తనయ అక్షరహాసన్ పేరు ఇప్పుడు నార్త్ లో మారుమోగిపోతోంది. దానికి కారణం ఆమె ప్రొఫెషనల్‌గా ఏదో సాధించేశారని కాదు. పర్సనల్‌గా ఇల్లు కొనుక్కున్నారని. అది కూడా 15.75 కోట్లు ఖర్చుపెట్టి ఇల్లు కొనుక్కున్నారన్నది వైరల్ అవుతున్న విషయం.
కమల్ తనయ అక్షర హాసన్ సౌత్‌లో పెద్దగా చేసిన సినిమాలేవీ లేవుగానీ, నార్త్ లో మాత్రం షమితాబ్ లాంటి సినిమాతో కాస్త పాపులర్ అయ్యారు. ముంబైలో తన తల్లి దగ్గరే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తుంటారు అక్షర హాసన్.
ఇప్పుడు ఆమె 15.75 కోట్లు ఖర్చుపెట్టి 2,245 స్క్వయర్ ఫీట్ల ఏరియాతో ఉన్న ఫ్లాట్ కొనుగోలు చేశారట. 15 అంతస్తుల భవనంలో ఆమె తీసుకున్న ఫ్లాట్ 13వ ఫ్లోర్‌లో ఉందట.
మూడు కార్ పార్కింగ్‌ల స్పేస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట అక్షర హాసన్. ముంబై ఖర్‌లోని 16వ రోడ్డులో ఈ అపార్ట్ మెంట్ ఉందట. బాల్కనీ వ్యూ సూపర్బ్ అన్నది నార్త్ నుంచి వినిపిస్తున్న మాట.
షమితాబ్ తర్వాత హిందీలో లాలి కి షాదీ మే లాడ్డూ దీవానా, సౌత్‌లో కడారమ్ కొండాన్, వివేగమ్, అచ్చమ్ మడం నానం పయిర్పు లాంటి ప్రాజెక్టులు చేశారు. అగ్ని సిరగుగల్‌లోనూ కీ రోల్ చేశారు అక్షర హాసన్.