
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఇన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు భార్యభర్తలుగా మారారు.

వీరిద్దరి వివాహం డిసెంబర్ 4న రాత్రి 8.15 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.

వీరిద్దరి పెళ్లి వేడుక ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. హీరో నాగచైతన్య-శోభితల వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

అలాగే టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రానా దగ్గుబాటి, రానా దగ్గుబాటి, రానా దగ్గుబాటి,సుహాసిని ,అడవి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు హాజరయ్యారు.

అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, ,అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి తదితరులు హాజరయ్యారు.