
కొందరు హీరోల కెరీర్‌లో కొన్ని సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి.. ఎందుకో తెలియదు. పవన్‌కు ఓజిలా అన్నమాట. కేవలం ఒక్క టీజర్‌తోనే ఈ సినిమాపై ఆకాశమంతా అంచనాలున్నాయి. సుజీత్ ఇచ్చిన ఎలేవేషన్స్ అలంటి మరి.

అలాగే తమిళంలో అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా వస్తుంది.. అనౌన్స్ చేసిన రోజు నుంచే దీనిపై అంచనాలు మామూలుగా లేవు. గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటే విడాముయార్చి సినిమా కూడా చేసారు అజిత్.

కానీ దీనిపై పెద్దగా అంచనాలు గానీ.. హైప్ కానీ లేదు. అనుకున్నట్లుగానే ఈ చిత్రం రావడం.. మూడు రోజులకే వెళ్లిపోవడం జరిగాయి. అజిత్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది విడాముయార్చి. అందుకే అజిత్ ఫ్యాన్స్ ఆశలన్నీ గుడ్ బ్యాడ్ అగ్లీపైనే ఉన్నాయి.

మార్క్ ఆంటోనీ లాంటి క్రేజీ సినిమా తర్వాత ఆధిక్ రవిచంద్రన్ నుంచి వస్తుంది గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమానే మైత్రి మూవీ మేకర్స్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. విడాముయార్చిలో మిస్సైన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

గుడ్ బ్యాగ్ అగ్లీ ట్రైలర్ చూసి ఫిదా అయిపోతున్నారు అజిత్ ఫ్యాన్స్. చాలా ఏళ్ళ తర్వాత అజిత్‌లోని స్టైలిష్ యాంగిల్ బయటికి తీసుకొచ్చారు దర్శకుడు అధిక్. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ అయితే ఏం చేయట్లేదు.. అజిత్ కూడా బయటికి రావట్లేదు కానీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ఏప్రిల్ 10న గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది.