
ఐశ్యర్య లక్ష్మీ ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేక పోవచ్చు. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక ఇటీవల రిలీజ్ అయిన మట్టి కుస్తీ అనే సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఐశ్వర్య నటన ప్రేక్షకులను మెప్పించింది.

అలాగే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది.

ఇక తాజాగా మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఐశ్వర్య. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.