
అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం అందుకోలేని ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అధితి రావు హైదరి ఒకరు.

ఈ చక్కనమ్మ తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే తెలుగులో సమ్మోహనం సినిమాతో మెప్పించింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

టాలీవుడ్ లో చివరిగా మహాసముద్రం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగి ఆకట్టుకుంటుంది.