
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నిర్మాత, టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ భార్య దివ్య ఖోస్లా కుమార్ విషాదంలో మునిగిపోయింది. ఆమె తల్లి గురువారం కన్నుమూశారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది దివ్య ఖోస్లా కుమార్. తన తల్లితో కలిసున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ 'అమ్మా.. నా మనసు ముక్కలైంది.. మా అమ్మ నన్ను విడిచి వెళ్లిపోయింది. కానీ నా మనసులో మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది' అని ఆవేదన వ్యక్తం చేసింది.

అలాగే 'నువ్వు నేర్పిన విలువలను ఎప్పటికీ నాతోనే ఉంచుకుంటాను. నీకు కూతురిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. లవ్ యూ మా' అని ఎమోషనలైంది దివ్య ఖోస్లా.

ఈక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు దివ్య ఖోస్లా కు మనో ధైర్యం చెబుతున్నారు. ఆమె తల్లి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

దివ్య ఖోస్లా కుమార్ గతంలో పలు హిందీ సినిమాల్లో నటించింది. 2005 ఫిబ్రవరి 13న టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. వీరికి 2011లో ఓ బాబు పుట్టాడు.