
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ అదా శర్మ.

ఆతర్వాత మెయిన్ హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది.

ఇప్పుడు అవి కూడా చేయడం లేదు. బాలీవుడ్ లోమాత్రం బిజీ అయిపోయింది. అక్కడ లేడీ ఓరియెంట్డ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ అమ్మడు నటించిన ది కేరళ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అదా శర్మ తన నటనతో కట్టిపడేసింది.

ఇక తాజాగా గంతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మూగజీవాలతో కలిసిఉన్న ఫోటోలను పంచుకుంది అదా శర్మ.