
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది వైష్ణవి చైతన్య. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ అమ్మడు.. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

బేబీ హిట్ తర్వాత వైష్ణవికి అవకాశాలు క్యూ కట్టాయి. లవ్ మీ, జాక్ చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కానీ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగ ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇక సినిమాలతోపాటు అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి. నిశా చూపులతో నెటిజన్లను మెంటలెక్కిస్తోంది ఈ వయ్యారి. నిశీదిలో జాబిలమ్మలా కిల్లర్ చూపులతో కట్టిపడేస్తుంది.

బేబీ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ కథ మొత్తం హీరోయిన్ వైష్ణవి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో తన అందం, నటనతో ఆకట్టుకుంది. ఈసినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఇండస్ట్రీలో వైష్ణవికి మంచి పేరు రావడంతో యూత్ లో సూపర్ క్రేజ్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు ఒక్కో సినిమాకు రూ. కోటి తీసుకుంటుందని టాక్ నడుస్తుంది. ఇక హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ సరసన నటిస్తుంది.