
హీరోయిన్ త్రిష గురించి చెప్పక్కర్లేదు. దాదాపు 20 ఏళ్లుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. తెలుగు, తమిళం భాషలలో ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ 42 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అసహనానికి గురైంది.

తనపై వస్తున్న తప్పుడు కథనాలపై మండిపడింది. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో త్రిష పెళ్లి గురించి అనేక రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అలాగే ఆమెకు సంబంధించిన పర్సనల్ ఫోటోస్ సైతం షేర్ చేస్తున్నారు.

దీంతో త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఎవరితో ఫోటోలు దిగితే వారిని పెళ్లి చేసుకున్నట్టేనా. ఇంకా ఎంతమందితో నా పెళ్లి చేస్తారు. స్నేహితులతో దిగిన ఫోటోలను చూపించి పెళ్లి వార్తలు రాస్తున్నారు. అలాంటి వారిని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇకనైనా ఫేక్ న్యూస్ రాయడం ఆపేయండి” అని ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం త్రిష చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతుండగా.. మరోసారి త్రిష పెళ్లి న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి జోడీగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. దాదాపు రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే దాదాపు 42 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది త్రిష. నిత్యం సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ కట్టిపడేస్తుంది. కొన్నాళ్లుగా త్రిష పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతుండగా.. ఇప్పటికే ఎన్నోసార్లు ఆ రూమర్స్ ఖండించింది.