
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ పటాకులు పేల్చి ఈ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక సినిమా సెలబ్రిటీలు కూడా ఈ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పటాసులు కాల్చారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఇంట్లో దీవాళి సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. తన భర్త, కూతురితో కలిసి పటాకులు కాల్చిందీ అందాల తార.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో శ్రీదేవి కూతురు ఎంతో క్యూట్ గా కనిపించింది. దీంతో నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు

కాగా ఈ మధ్యనే నారా రోహిత్ నటించిన సుందర కాండ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి. అలాగే పలు టీవీ షోస్, డ్యాన్స్ రియాలిటీ షోస్ లోనూ సందడి చేస్తోందీ అందాల తార.