కుర్రకారును ఆగం చేస్తున్న కాయదు.. అందంతో గత్తరలేపుతోందిగా..
యూత్ లేటెస్ట్ క్రష్ కాయదు లోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేచురల్ లుక్‌లో కనిపిస్తూ ఈ ముద్దుగుమ్మ అందరి మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్‌లో చీకటిలో తన అందాలను ఆరబోస్తూ , యూత్‌ను ఆగం చేస్తుంది. తన క్యూట్‌నెస్‌తో చంపేస్తుంది.
Updated on: Oct 21, 2025 | 6:00 PM

యూత్ లేటెస్ట్ క్రష్ కాయదు లోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేచురల్ లుక్‌లో కనిపిస్తూ ఈ ముద్దుగుమ్మ అందరి మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్‌లో చీకటిలో తన అందాలను ఆరబోస్తూ , యూత్‌ను ఆగం చేస్తుంది. తన క్యూట్‌నెస్‌తో చంపేస్తుంది.

కుర్రకారు ఫేవరెట్ కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది డ్రాగన్ మూవీతో యూత్ ఫేవరెట్ అయిపోయింది. ఈ సినిమాతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

కాయదు లోహర్ మోడల్‌గా తన కెరీర్ స్టార్ చేసింది. తర్వాత నటనపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ముగిల్ పేట్ అనే కన్నడ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక శ్రీ విష్ణు సరసన అల్లూరి చిత్రంలో నటించి, ఈ మూవీతోనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అంతగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది.

కానీ డ్రాగన్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకొని, యూత్ లేటెస్ట్ క్రష్ అయిపోయింది. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్స్ రేజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాకుండా చాలా ఆఫర్స్ అందుకొని వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక కాయదు ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ , తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ పింక్ కలర్ చుఢీదార్‌లో తన అంద, చందాలతో అందరి మనసు దోచేస్తుంటుంది.