
నిన్నమొన్నటిదాకా శ్రీలీల అనే పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేవి ఒన్లీ కమర్షియల్ సినిమాలు మాత్రమే. కానీ ఇప్పుడు లెక్క మారింది. భగవంత్ కేసరిలో విజ్జి పాప కేరక్టర్ చూసిన వారందరూ ఈలలేస్తున్నారు.నందమూరి బాలకృష్ణతో పోటీపడి స్క్రీన్ మీద సన్నివేశాలను పండించడం అంత తేలిక కాదు.

అలాంటిది విజ్జీ పాప కేరక్టర్‌లో శ్రీలీల కేక పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా భగవంత్ కేసరి. ఇందులో నందమూరి బాలకృష్ణ చిచ్చాగా, శ్రీలీల విజ్జీ పాప కేరక్టర్‌లో ఆయన బిడ్డగా నటించారు. విజ్జీ పాప కేరక్టర్‌కి రకరకాల వేరియేషన్స్ ఉంటాయి.

ప్రతి సందర్భంలోనూ ప్రతి ఎమోషన్‌నీ స్క్రీన్ మీద చక్కగా పండించారు శ్రీలీల. ఆమె ఫస్ట్ సినిమా పెళ్లి సందడి విడుదలైనప్పుడు 'అమ్మాయి చూడ ముచ్చటగా ఉంది... తప్పకుండా వరుస ఛాన్సులు వస్తాయి' అని అనుకున్నారంతా.

ఆ తర్వాత ధమాకా విడుదల కాగానే అందరూ గోల్డెన్ లెగ్ అన్నారు. స్కందలో రామ్‌తో సరిసమానంగా స్టెప్పులేసి వావ్ అనిపించుకున్నారు. ఈ సినిమా తర్వాత భగవంత్ కేసరి రిజల్ట్ కోసం జనాలు వెయిట్ చేశారు.

ఇందులోనూ ఆమె కేరక్టర్‌కి మంచి మార్కులు పడుతుండటంతో, అటు కమర్షియల్‌గానూ, ఇటు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కేరక్టర్లకూ శ్రీలీల పక్కాగా సూట్ అవుతారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటిదాకా సౌత్ సినిమాల్లో హీరోయిన్ ఓరియంటెడ్ కేరక్టర్లు అనగానే అనుష్క, కీర్తీసురేష్, సాయిపల్లవి, నిత్యామీనన్, సమంత లాంటి కొంతమంది నటీమణుల పేర్లు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు శ్రీలీల పేరు కూడా వీరి లిస్టులో చేరింది.

ముఖ్యంగా భగవంత్ కేసరి సినిమాలో క్లైమాక్స్ ఫైట్‌లో శ్రీలీల పెర్ఫార్మెన్స్ చూసి 'ఫుల్ ప్లెడ్జ్‌డ్ హీరోయిన్ దొరికింది. శ్రీలీలను నమ్మి ఎలాంటి కథయినా రాసుకోవచ్చనే' నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కెప్టెన్లు.