
అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఫ్లాప్, హిట్స్‌తో సంబంధం లేకుండా వరసగా ఆఫర్స్ అందుకుంటూ, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోతుంది.

ఇక పెళ్లి సందడి మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎట్రీ ఇచ్చిన ఈ చిన్నది. మొదటి సినిమాతోనే తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.అంతే కాకుండా తన డ్యాన్స్ , నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కట్టాయనే చెప్పాలి. దీంతో వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా సత్తా చాటింది.

ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ ధమాకా సినిమాలో నటించి, ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక దీని తర్వాత స్కంద, గుంటూరు కారం ఇలా చాలా సినిమాల్లో నటించడమే కాకుండా పుష్ప2లో స్పెషల్ సాంగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు తన గ్లామర్, డ్యాన్స్‌తో అదరగొట్టిందనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ తన అభిమానులు ఎంటర్టైన్ చేస్తుంటుంది.

అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టైలిష్ లుక్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా చీరకట్టుల చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.