
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది.

ఆ తర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. అలాగే కలర్ ఫోటో సినిమాతో పేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో చాందిని చౌదరి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత చాందిని వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మొన్నామధ్య విష్వక్ సేన్ గామీ తో పాటుగా లేటెస్ట్ గా వచ్చిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాలతో ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే చాందిని చౌదరిని ఆ మధ్య ఒకరు బెదిరించారట. గెస్ట్ హౌస్ కు రావాలని లేకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేస్తా అని బెదిరించారట. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఒకరోజు కొత్త నెంబర్ నుంచి చాందిని చౌదరికి మెసేజ్ వచ్చిందట.. ఆ మెసేజ్ లో గెస్ట్ హౌస్ కు రావాలి అని.. లేకుంటే తన ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేస్తా అని ఉందట.

అది చూసిన చాందిని ఏం చెయ్యాలో తెలియక తెగ ఏడ్చేసిందట. అయితే ఆ బెదిరించింది మరెవరో కాదు స్నిగ్ద. టాలీవుడ్ లో టామ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నటి స్నిగ్ధ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు మీరెప్పుడైన దూల పని చేశారా.? అనే ప్రశ్న ఎదురైంది.అయితే ఇలా తాను చాందిని చౌదరిని సరదాగా ఏడిపించా అని తెలిపింది.

అయితే అసలు విషయం చెప్పిన తర్వాత చాందిని నువ్వెక్కడున్నావ్ అని అడిగిందట.. పాలనా ప్లేస్ లో ఉన్నాను అని చెప్తే అక్కడికి వచ్చి లాగిపెట్టి కొట్టిందట అదే విషయాన్ని స్నిగ్ధ స్వయంగా చెప్పుకొచ్చింది.