
హీరోయిన్ స్నేహ.. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలో ఆమెకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న అందాల తార.

తొలివలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్నేహా. ఆ తర్వాత ప్రియమైన నీక్, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, రాధా గోపాలం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. సంప్రదాయ లుక్లో కనిపించి హీరోయిన్ సౌందర్యను గుర్తుచేసింది. అందుకే స్నేహను తెలుగు ప్రేక్షకులు జూనియర్ సౌందర్య అని పిలుచుకుంటారు.

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాందిచుకున్న స్నేహ..పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

కొన్నాళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ, అల్లు అర్జున్ నటించిన S/o సత్యమూర్తి చిత్రాల్లో సహయ నటిగా కనిపించి మెప్పింది.

ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెరపై పలు రియాల్టీ షోస్ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. రెడ్ డ్రెస్లో అందంగా కనిపిస్తుంది స్నేహ.