
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భా,లలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అందం, అభినయంతో అప్పుట్లో ప్రేక్షకులను కట్టిపడేసింది.

తన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ గ్లామర్ పాత్రలకు వెనుకాడలేదు. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతుంది.అలాగే సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తోంది ఈ అమ్మడు.

నిత్యం గ్లామర్ ఫోజులతో స్టన్నింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్పెషల్ సారీలో మెరిసింది శ్రియా. బ్లాక్ కలర్ డీప్ వీ బ్లౌజ్ మ్యాచ్ గా మెరిసే సీక్విన్ సారీలో మెరిసింది.

బ్లాక్ కలర్ సారీలో స్టైలీష్ లుక్ తో.. మరింత అందంగా కనిపిస్తుంది. ఇక క్లాసీ హెయిర్ కర్ల్స్, మినిమల్ మేకప్, చిన్న బిందీతో ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే స్టైలీష్ కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు.

ప్రస్తుతం శ్రియా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. 40 ఏళ్ల వయసులోనే ఇంత అందమేంటీ మేడమ్... ఈ ముందు కుర్ర హీరోయిన్లకే టెన్షనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తుంది శ్రియా.