
సీనియర్ బ్యూటీస్ ఇప్పటికి కూడా తరగని అందంతో కట్టిపడేస్తున్నారు. యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని సోయగాలతో అభిమానులను అలరిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రియ గురించే. ఈ అందాల భామ స్టార్ హీరోయిన్ గా రాణించింది.

తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది శ్రియ. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించిన శ్రియ పుట్టిన రోజు నేడు. నాలుగు పదుల వయసులోనూ ఈ చిన్నది గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక అందంలో తనకు తానే సాటి అని అంటున్న భామల్లో సంయుక్త మీనన్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో రానాకు జోడిగా నటించింది సంయుక్త.

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది. ఆతర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ధనుష్ నటించిన సార్ సినిమాలో నటించింది ఇలా మూడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది.

ఆతర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో మరో హిట్ అందుకుంది. విరూపాక్ష సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో సంయుక్త నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు ఈ చిన్నదాని పుట్టిన రోజు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో సినిమా చేసింది సంయుక్త. కథ ఎంపిక విషయంలో సంయుక్త ఆచి తూచి అడుగులేస్తోంది.