
జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సద. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో భారీ విజయాన్ని కూడా అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. బ్యాక్ యు బ్యాక్ సినిమాలు చేసి ఆకట్టుకుంది.

తక్కువ సమయంలోనే సదా పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది. యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది సద. అదే సమయంలో తమిళ్ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు సినిమాలో నటించింది.

అపరిచితుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది సదా. ఆతర్వాత సదా కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

క్రమంగా ఆమె సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది . మరోసారి సినిమాల్లో బిజీ కావాలని చుస్తున్నారు సదా. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అదిరిపోయే ఫొటోలతో ఆకట్టుకుంటున్నారు.

తాజాగా ఆమె లంగాఓణిలో ఫోటోలకు ఫోజులిచ్చింది. వయసు పెరుగుతున్నా తరగని అందంతో ఆకట్టుకుంటుంది సదా.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.