
రీతూ వర్మ.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరోయిన్ గా సత్తా చాటుతుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడుకు అంతగా క్రేజ్ మాత్రం రాలేదు.

తెలుగుతోపాటు తమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. కెరీర్ తొలినాళ్లల్లో పలు షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ అమ్మడు.. బాద్షా సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో కథానాయికగా మారింది.

తెలుగులో నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులో టక్ జగదీష్, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని , స్వాగ్ చిత్రాలతో అలరించింది.

ఇప్పుడు తెలుగులో విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటుంది. కానీ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్టు అందుకోలేకపోయింది. ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచుూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. యాక్షన్ సినిమాలతోపాటు గ్లామర్ సీన్స్ చేసేందుకు సైతం రెడీ అంటుంది రీతూ. కథలో డిమాండ్ ఉండి.. కథకు తగ్గట్లుగా చేస్తానని.. గ్లామర్ షోకు తాను దూరం కాదంటుంది రీతూ వర్మ.