
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు ప్రీతి ముకుందన్. ఓం భీమ్ బుష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ వయ్యారి.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మాడికి తెలుగులో మంచి క్రేజ్ వచ్చేసింది.

ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉండిపోయింది. వరుసగా సక్సెస్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే కన్నప్ప మూవీతో మరో సక్సెస్ అందుకుంది. ఈ చిత్రంలో అందం, అభినయంతో కట్టిపడేసింది.

కన్నప్ప సినిమా తర్వాత ఈ అమ్మడు ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు వరుసగా ఆఫర్స్ మాత్రం అందుకుంటుంది. ఇటీవలే మలయాళంలో నివిన్ పౌలీ సరసన ఓ సినిమాకు ఈ అమ్మడు సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది.

తాజాగా మలయాళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది. తాజాగా హృదు హరూన్ హీరోగా నటిస్తున్న మైనే ప్యార్ కియా అనే చిత్రంలోనూ ఈ బ్యూటీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

కేవలం మలయాళంలోనే కాకుండా అటు తమిళం, తెలుగు భాషలలోనూ ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు సినిమాలతోనే అటు సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.