Tollywood: పెళ్లిపీటలెక్కనున్న క్రేజీ హీరోయిన్.. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. ఫొటోస్ వైరల్

Updated on: Feb 04, 2025 | 1:39 PM

15 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫిల్మ్ ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సొంతం చేసుకుంది.

1 / 6
 మలయాళ ప్రముఖ హీరోయిన్‌ పార్వతి నాయర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఓ వ్యాపార వేత్తతో కలిసి ఆమె ఏడడుగులు నడవనుంది.

2 / 6
  చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్‌ అశోక్‌ తో ప్రేమలో ఉన్న ఆమె త్వరలోనే ఏడడుగులు వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

3 / 6
 అంతేకాదు తమ నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

4 / 6
 కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పార్వతి నాయర్- అశోక్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

5 / 6
 'మైసూర్‌ శాండల్‌' సోప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పార్వతి నాయర్‌ పేరు మార్మోగిపోయింది. ఇప్పటి వరకు సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించిందీ అందాల తార.

6 / 6
 తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెండాపై కపిరాజు సినిమాలో  పార్వతి నాయర్ పాత్రలో మెప్పించింది. గతేడాది విజయ్ నటించిన ది గోట్ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో మెరిసిందీ అందాల తార.