
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నారు.

సినిమా సెలబ్రిటీలు కూడా దీపావళి వేడుకల్లో భాగమవుతున్నారు. ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నారు

ఈ క్రమంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన నభా నటేష్ దీపావళి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా అందంగా చక్కని చీరకట్టులో ఎంతో అందంగా ముస్తాబైందీ అందాల తార.

న దీపావళి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నభా అందరికీ పండగ విషెస్ చెప్పింది. ఈ ఫొటోల్లో నభా ఎంతో అందంగా కనిపించిందని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నభా నటేష్. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.