Rajeev Rayala |
Updated on: Jun 22, 2024 | 8:28 PM
అలనాటి అందాల తారల్లో మీనా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. మీనా తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది.
మీనా తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి.
తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.
2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం అయింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. తేరీ సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతూ 2022 జూన్ 28న రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో మీనా భర్త తుది శ్వాస విడిచారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనా .. రెగ్యూలర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు మీనా. వయసు పెరుగుతున్నా తరగని అందంతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది మీనా.