
ప్రస్తుతం ఈ హీరోయిన్ వయసు 51 సంవత్సరాలు. అయినా అందం, ఫిట్నెస్ విషయంలో మాత్రం కుర్ర హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తుంది. ఏమాత్రం తగ్గని అందం, వయ్యారితో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ మలైకా అరోరా. బాలీవుడ్ తోపాటు సౌత్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటింది. హీరోయిన్ గా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ .. స్పెషల్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఇండస్ట్రీలో స్పెషల్ పాటలతో కట్టిపడేసింది.

ఆకట్టుకునే అందంతోపాటు మంచి ఫిట్నెస్ లుక్ తో ఎప్పటికప్పుడు వార్తలలో నిలుస్తుంటుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాతికేళ్లు దాటింది. అప్పటి నుంచి చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు స్టార్ డమ్ కొనసాగిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా ఫోటోస్ వైరలవుతున్నాయి.

51 ఏళ్ల వయసులోనూ గ్లామర్ ఫోటులతో నెట్టింట గత్తరలేపుతుంది. ఫిట్నెస్, లుక్స్ విషయంలో మలైకా ఏ రేంజ్ జాగ్రత్తలు తీసుకుంటుందో ఆమె ఫోటోస్ చూస్తే చెప్పొచ్చు. నిత్యం కఠినమైన వ్యాయమాలు, యోగా చేయడంతోపాటు మంచి డైట్ ఫాలో అవుతున్నట్లు గతంలోనూ చెప్పుకొచ్చింది.

తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి. ఆకట్టుకునే అందంతోపాటు మంచి ఔట్ ఫిట్స్ ధరించి అందంగా కనిపిస్తుంది. 51 ఏళ్ల వయసులోనూ ఈ అందమేంటీ మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.