
లయ .. ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ,మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అందాల లయ.

భద్రం కొడుకో అనే సినిమాతో హీరోయిన్ గ పరిచయం అయ్యింది లయ. ఆతర్వాత వచ్చిన స్వయంవరం సినిమాతో మంచి హిట్ అందుకుంది. వేణు హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో లయకు వరుస ఆఫర్స్ వచ్చాయి.

దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది లయ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన లయ మలయాళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కానుంది.

లయ చివరిగా టాటా బిర్లా మధ్యలో లైలా అనే సినిమాలో కనిపించింది. ఆతర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. పెళ్లి తర్వాత లయ అమెరికాలో సెటిల్ అయ్యింది.

అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన లయ పై చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడుతూ.. నేను అమెరికాలో అడుక్కుతింటున్నా.. రోడ్డున పడ్డాను అని వార్తలు పుట్టించారు. అవి చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది అని అన్నారు. అలాగే ఓ దర్శకుడు తనను బెదిరించాడు అని కూడా తెలిపారు లయ.