బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ కరీనా కపూర్. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన కరీనా పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం సినిమాలు తగ్గించేసింది..
తనకన్నా వయసులో చాలా పెద్దవాడైన సైఫ్ అలీఖాన్ ను ప్రేమించి పెళ్లాడింది కరీనా. అప్పటికే సైఫ్ కు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా కపూర్ పెళ్లి పిల్లలు గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. పిల్లలకోసమే పెళ్లి చేసుకున్నా అని తెలిపింది కరీనా.
పిల్లలు కావలి అనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. లేదంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదుఅంటుంది కరీనా. తాను ఐదేళ్లు సైఫ్ తో సహజీవనం చేసిన తర్వాత పిల్లలకోసమే పెళ్లి చేసుకున్నా అని తెలిపింది.