Rajitha Chanti |
Updated on: Feb 11, 2023 | 10:08 PM
Kajol: కాజోల్ అందంపై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన హీరోయిన్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కాజోల్ ఒకరు. 90's అందం, అభినయంతో కట్టిపడేసింది. మూడు దశాబ్దలుగా తన నటనతో అలరిస్తూ లక్షలాది మంది అభిమమానుల్ని సంపాదించుకుంది.
గత కొద్ది రోజులుగా ఆమె అందంపై కొంతమంది నెగిటివ్ ట్రోలింగ్స్ చేస్తున్నారు ఆమె పాత ఫోటోలను. లేటేస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ.. స్కిన్ వైటెనింగ్ సర్జరీ చేయించుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది. అయితే కొందరు మరింతగా ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
గతంలో కాజోల్ తను తెల్లగా అవ్వడం కోసం ఎలాంటి సర్జరీలు చేసుకోలేదని చెప్పింది. సినిమా షూటింగ్స్ కోసమని గతంలో ఎండలో ఎక్కువ సమయం గడిపానని అందుకే కాస్త నల్లబడిట్లు చెప్పుకొచ్చారు.