- Telugu News Photo Gallery Cinema photos Actress Aparna Balamurali got best actress in 68th national film awards
Aparna Balamurali: 68th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా(సూరరై పోట్రు) అపర్ణ బాలమురళి
సూరరై పోట్రు సినిమా అవార్డుల పంట పండించింది. తెలుగులో ఆకాశమే నీహద్దురా గా వచ్చిన వచ్చిన ఈ సినిమా 68th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఏకంగా మూడు క్యాటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది.
Updated on: Jul 22, 2022 | 7:15 PM

సూరరై పోట్రు సినిమా అవార్డుల పంట పండించింది. తెలుగులో ఆకాశమే నీహద్దురా గా వచ్చిన వచ్చిన ఈ సినిమా 68th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఏకంగా మూడు క్యాటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది.

జాతీయ ఉత్తమ నటుడిగా.. హీరో సూర్యకు అవార్డు వచ్చేలా చేసింది. దాంతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడిగా.. జీవీ ప్రకాశ్ జాతీయ స్థాయిలో నిలబెట్టింది.

ఇక ఈ ఇద్దరితో పాటు.. సూరరై పోట్రు సినిమాలో నటించిన అపర్ణ బాలమురళి కూడా జాతీయ ఉత్తమ నటిగా రికార్డుల కెక్కారు. ఉత్తమ నటి కేటగిరీలో .. అందర్నీ వెనక్కి నెట్టేసి మరీ అవార్డును దక్కించుకున్నారు.

తన నేచురల్ యాక్టింగ్‌తో సినిమాకే అందం తీసుకువచ్చారు. తను తప్ప ఇంకెవరూ ఆ పాత్ర పోషించలేరనే స్థాయిలో జీవించారు.

నేషనల్ జ్యూరీని మెప్పించి మరీ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు.

ఇక కేరళలోని తిరిస్సూర్ లో పుట్టిన అపర్ణ.. 2015లోనే నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 'ఒరు సెకండ్ క్లాస్ యాత్రా' మూవీతో మల్లూ వుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా.. ఫిల్మ్ కెరీర్లో దూసుకుపోతున్నారు.

తమిళ్ , మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.




