Rajitha Chanti |
Apr 15, 2023 | 1:25 PM
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అనిక సురేంద్రన్. ఇటీవల బుట్టబొమ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
అజిత్ కుమార్ నటించిన విశ్వాసం చిత్రంలో ఆయన కూతురిగా నటించి తెలుగు తెరపై సందడి చేసింది ఈ మలయాళీ కుట్టి.
ఇవే కాకుండా.. ఇటీవల నాగార్జున నటించిన ఘోస్ట్ చిత్రం ఆయన మేనకోడలిగా నటించి మెప్పించింది.
ఇక హీరోయిన్గా బుట్టబొమ్మ సినిమాతో అలరించింది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనిక.. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
తాజాగా ఈరోజు మలయాళీల అత్యంత ప్రతిష్టాత్మకమైన విషు పండగ సందర్భంగా ఫాలోవర్లకు శుభాకాంక్షలు తెలిపింది.
ఈ ఫెస్టివల్ సందర్భంగా అనిక షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. కన్నయ్య ఎదురుచూపుల్లో నిలిచిన రాధమ్మగా ముస్తాబయ్యింది అనిక.
కన్నయ్య ఎదురుచూపుల్లో రాధమ్మ.. బుట్టబొమ్మ అనిక సురేంద్రన్ అందమైన ఫోటోస్..