
మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది.

ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అనన్య నాగళ్ళ. ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం బడా సినిమాల్లో ఛాన్స్ లకోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికైతే చిన్న సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది అనన్య.

ఇక సోషల్ మీడియాలో అనన్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అనన్య.తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.