Amritha Aiyer: అందం, అభినయం ఉన్నా అవకాశాలు అందుకోలేకపోతున్న వయ్యారి భామ
టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. హనుమాన్ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది.
Updated on: Mar 11, 2025 | 5:10 PM

టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

హనుమాన్ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాల్లో నటిస్తుంది. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అమృత.

అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగ సినిమాలో సైడ్ యాక్టర్ గా కనిపించింది ఈ భామ. ఇక తెలుగులో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది.

ఇక హనుమాన్ సినిమా అంత భారీ హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరిగా ఈ భామ చేసిన బచ్చల మల్లి సినిమా నిరాశపరిచింది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు మరింత తగ్గాయి.

సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అమృత. తాజాగా ఈ చిన్నది కొన్ని క్రేజీ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.





























