
కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరైన అదితి ప్రభుదేవా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ వ్యాపారవేత్త యశస్వితో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు నటులు యష్, రాధిక పండిట్, జై జగదీష్, రచన ఇందర్, అభిషేక్ అంబరీష్, మేఘనా రాజ్ సర్జా వంటి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కన్నడ బుల్లితెర నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా అదితి వివాహానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ వివాహ వేడుకలో అదితి టెంపుల్ జ్యువెలరీతో.. తెలుపు, ఎరుపు రంగు పెళ్లి పట్టు చీరను ధరించగా, యశష్ పట్టు ధోతీ, చొక్కా ధరించి ఎంతో అందంగా కనిపించారు.

పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు కూడా అదితి- యశస్వి దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అదితి ప్రభుదేవా నటించిన 'ట్రిపుల్ రైడింగ్' చిత్రం గత వారం (నవంబర్ 25) విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.