Sai Kiran: ‘కోయిలమ్మ’ నటి మెడలో సాయి కిరణ్ మూడు ముళ్లు.. పెళ్లి ఫొటోలు ఇదిగో

|

Jan 10, 2025 | 2:00 PM

సినిమాలు, సీరియల్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు నటుడు సాయి కిరణ్. ఇటీవల అతను కోయిలమ్మ నటి స్రవంతితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. తాజాగా తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుని మురిసిపోయాడీ నటుడు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

1 / 6
 లెజెండరీ సింగర్ పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ హీరోగా, సహాయక నటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు.

2 / 6
 నువ్వే కావాలి సినిమాతో సాయి కిరణ్ కుమంచి గుర్తింపు వచ్చింది. అలాగే   లయతో కలిసి ప్రేమించు సినిమాలో నటించి సోలో హీరోగా సక్సెస్ కొట్టాడు.

3 / 6
 ఇక మనసుంటే చాలు', 'ఎంత బావుందో  తదితర చిత్రాల్లోనూ సాయి కిరణ్ నటించాడు. అయితే ఆ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు.

4 / 6
 ప్రస్తుతం బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటున్నాడు సాయి కిరణ్. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

5 / 6
 గతేడాది డిసెంబర్ లో తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో కలిసి పెళ్లిపీటలెక్కాడు సాయికిరణ్. ఈ వేడుకకు మహేశ్వరితో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

6 / 6
 తాజాగా తమ పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు సాయి కిరణ్. దీంతో ఇవి ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు