AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

A సర్టిఫికేట్ సినిమానా ?? అయితే కాసుల వర్షం కురవడం పక్కా

A సర్టిఫికెట్ కావాలని దర్శక నిర్మాతలే సెన్సార్ బోర్డు సభ్యులను అడుగుతున్నారా..? తమ సినిమా పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ కోరి మరీ తెచ్చుకుంటున్నారా..? అదేంటి A వస్తే వాళ్లకే కదా నష్టం అనుకుంటున్నారు కదా..! అందులో కూడా బిజినెస్ స్ట్రాటజీ ఉంది. తాజాగా మరో సినిమాకు A సర్టిఫికేట్ వచ్చింది. ఈ నయా బిజినెస్ ట్రెండ్‌పైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jul 02, 2025 | 4:31 PM

Share

A సర్టిఫికెట్ సినిమాల టైం నడుస్తుందిప్పుడు ఇండస్ట్రీలో. పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సభ్యులు చెప్తున్నా థియేటర్స్ మాత్రం పిల్లా పెద్దలతో నిండిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా అడల్ట్స్ ఓన్లీ అని సెన్సార్ బోర్డు చెప్పిన సినిమాలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.

1 / 5
వందల కోట్లు వసూలు చేసిన యానిమల్, సలార్.. మంచి హిట్టైన హిట్ 3 లాంటి సిని	మాలకు వచ్చింది A సర్టిఫికేటే. సినిమాకు A సర్టిఫికెట్ వచ్చిందంటే అందులో ఏదో ఉందనే ఆసక్తి ఆడియన్స్‌లోనూ పెరిగిపోతుంది. అదే కలెక్షన్స్ పెంచేస్తుంది.

2 / 5
సలార్, యానిమల్ మాత్రమే కాదు.. రెండేళ్ళ కింద బేబీ కూడా A సర్టిఫికేట్‌తో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మధ్యే శ్రీ విష్ణు సింగిల్ సినిమాకు సైతం A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇది యూత్‌కు బాగానే కనెక్ట్ అయింది.

3 / 5
తాజాగా నితిన్ తమ్ముడు సినిమాకు కూడా A సర్టిఫికేట్ వచ్చింది. అభ్యంతరకర డైలాగ్స్, మితిమీరిన హింస, బోల్డ్ కంటెంట్ ఉన్నప్పుడే A సర్టిఫికెట్ ఇస్తుంది సెన్సార్ బోర్డు. అయితే తమ్ముడులో రొమాన్స్ ఉండకపోవచ్చు గానీ యాక్షన్ బ్లాక్స్ బాగానే ఉండబోతున్నాయి.  హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టే ఈ సినిమాకు A సర్టిఫికెట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. జులై 4న విడుదల కానుంది తమ్ముడు.

4 / 5
ఒకప్పుడు A సర్టిఫికేట్ అంటేనే భయపడే నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం అదే కావాలంటున్నారు. దీని వల్ల ఓపెనింగ్స్ భారీగా వస్తున్నాయి. A అంటే అన్నిసార్లు రొమాన్స్ మాత్రమే కాదు.. కొన్నిసార్లు సెన్సిబుల్ కంటెంట్‌కు కూడా వస్తుంది. తమ్ముడు ఇదే జాబితాలోకి వచ్చే సినిమా. ఈ మధ్య కాలంలో A రేటెడ్ సినిమాలు తెలుగులో బాగానే వస్తున్నాయి.

5 / 5