
లాంగ్ గ్యాప్ తరువాత ప్రభాస్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లే అప్‌డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.మిర్చి సినిమా తరువాత ప్రభాస్ ఫుల్ మాస్ యాక్షన్ రోల్ ఇంత వరకు చేయలేదు. సాహో సినిమాలో యాక్షన్ హీరోగా కనిపించినా.. ఆ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.

అందుకే సలార్ సినిమాలో ప్రభాస్ మాస్ అవతార్ చూసేందుకు ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో సలార్ మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

అప్పటికి పెద్దగా మాస్ ఇమేజ్ లేని యష్‌తోనే కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా హిట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్, అలాంటి డైరెక్టర్‌కి ప్రభాస్ లాంటి సాలిడ్ మాస్ కౌటౌట్ దొరకటంతో గ్లోబల్ రేంజ్ మూవీని ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ సలార్ మీద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ విషయంలో వచ్చిన మరో అప్‌డేట్ సలార్‌ను గ్లోబల్ మూవీ అన్న రేంజ్‌కు చేర్చింది. ఈ సినిమాలో ఓ హాలీవుడ్ స్టార్ కీ రోల్‌లో కనిపించబోతున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది.

గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంటర్నేషనల్ మాఫియాను చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. అందుకే డాన్ రోల్ కోసం హాలీవుడ్ స్టార్‌ను రంగంలోకి దించుతున్నారు. ఈ అప్‌డేట్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.