1 / 5
చియా విత్తనాలు ఎలా తినాలో.. ఎప్పుడు తినాలో చాలా మందికి అవగాహన ఉండదు. వీటిల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, వివిధ ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇతర పోషకాలు కూడా చియా గింజల్లో అధికంగా ఉంటాయి. చియా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గడంతోపాటు పలు రకాల చర్మ, జుట్టు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.